సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్న పోలీసులు

సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్న పోలీసులు
X

ముంబై పోలీసులు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాను ప్రశ్నించారు. బంద్రాలోని వర్సోవా పోలీస్ స్టేషన్ లో ఆదిత్య వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. ఈరోజు ఆదిత్య వ్యక్తిగత లాయర్లతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. సుమారు నాలుగు గంటలు పాటు అక్కడే ఉన్నారు. గత నెల 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్యపై పలు ఆరోపనలు బయటకు వస్తున్నాయి. ఇండస్ట్రీలో వైరాలతో మానసిక ఒత్తిడి కారణంగా ఆయన చనిపోయారని అంటున్నారు. దీంతో ఈ కేసులో పలుకోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Tags

Next Story