ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోల కోసం కూంబింగ్

ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోల కోసం కూంబింగ్

తెలంగాణ, చత్తిస్గడ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మణుగూరు ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోల కోసం వెయ్యిమంది పోలీసులతో సరిహద్దుల్లో భారీ కూంబింగ్ చేపట్టారు. గ్రేహౌండ్స్ , స్పెషల్ పార్టీ పోలీసులు, ఆర్మీ రిజర్వ్ దళాలు కూంబింగ్ లో పాల్గొంటున్నాయి. అక్కడి పరిస్థితిని డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అటు చాలా కాలం తరువాత మావోలు రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖమ్మంలో యువత అదృశ్యం కావడంపై దృష్టిసారించారు. వారు మావోయిస్టు పార్టీలో ఏమైనా చేరారా అనే దానిపై ఆరాతీస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story