వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు : రంగంలోకి సీబీఐ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు : రంగంలోకి సీబీఐ
X

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు సిబిఐ రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో ఏడుగురు సభ్యుల బృదం కడప జిల్లాకు చేరుకుంది. వివేకా హత్య జరిగి పదహారు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ గతంలో వేసిన సిట్ ఏమి తేల్చలేదు. దీంతో కోర్టు ఆదేశాలతో కడప చేరుకున్న సిబిఐ అధికారులు.. ఎస్పీ అన్బురాజన్ తో సమావేశమై కేసుపై చర్చించారు.

కడప, పులివెందులలో సిబిఐ అధికారులు వారం రోజులపాటు మకాం వేయనున్నారు. అటు వివేకా హత్యకేసు విచారణ అధికారి డిఎస్పీ వాసుదేవన్ ను కూడా సిబిఐ అధికారులు విచారించనున్నారు. హత్య కేసుకు సంబంధించిన డాక్యూమెంట్లను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన వివేకా ఇంటిని కూడా సిబిఐ అధికారులు పరిశీలిస్తారు. సిట్ లో భాగంగా విచారణ జరిపిన అధికారులను కూడా వేర్వేరుగా విచారించనున్నారు.

Tags

Next Story