కరోనా టైమ్ లో బర్త్ డే పార్టీ.. ఎవరో తెలిస్తే..

అందరికంటే వాళ్లే ఎక్కువ కష్టపడుతుంటారు.. అందరికంటే వైరస్ గురించి వాళ్లకే ఎక్కువ తెలుసు. అయినా అశ్రద్ధ. వచ్చిన తరువాత చూసుకుందామనే తెగింపో లేక వచ్చినా చేసేందేం లేదన్న వైరాగ్యమో కానీ ఆ డాక్టర్లకు బర్త్ డే పార్టీ చేసుకోవాలనిపించింది. గత నాలుగు నెలలుగా రోగులకు సేవలందించి అలసిపోయిన శరీరాలకు కాస్త స్వాంతన చేకూర్చాలనుకున్నారేమో.. అసలే మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా ఉండి అధికారులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఫూణేలోని శిరూర్ తలేగావ్ ధమ్‌ధేర్‌లో ఉన్న అరోహా శ్రద్ధ అగ్రిటూరిజం రిసార్ట్ లో 11 మంది వైద్యులు శుక్రవారం రాత్రి బర్త్ డే పార్టీ చేసుకున్నారు.
డాక్టర్లు పార్టీ చేసుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఒక బృందాన్ని పంపి ఎంక్వైరీ చేయగా పార్టీ నిజమేనని తేలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రిసార్ట్ మేనేజర్ ను ప్రశ్నించగా పార్టీ జరగడం లేదని ఖండించారు. వైద్యులను ప్రశ్నించగా.. అందరం ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నామని తోటి వైద్యుడి పుట్టిన రోజు జరుపుకుంటున్నామని అన్నారు. వేడుకలలో విందు ఏర్పాటు చేశారు కానీ, మద్యం సేవించారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కేసును శిక్రపూర్ పోలీస్ స్టేషన్ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ మాలి దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com