ఆయిల్ నేను రాయాలి.. నువ్వు రాయడమేంటి?

ఆయిల్ నేను రాయాలి.. నువ్వు రాయడమేంటి?

ఆరేళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల బామ్మని సైతం ఆకర్షించే బుల్లితెర యాంకర్ సుమ. తనదైన స్టైల్లో పంచులు వేస్తూ ఆధ్యంతం ఆకట్టుకునేలా షోని రక్తి కట్టిస్తుంది. 20 ఏళ్ల నుంచి బుల్లితెర మీద ఆమెని చూస్తున్నా బోరు కొట్టదు ఎవ్వరికీ. సుమ షో వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతుంటారు బుల్లి తెర అభిమానులు. తాజాగా లాక్ డౌన్ అనంతరం మరో యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సుమకు మనస్విని, రోషన్ ఇద్దరు పిల్లలు.

రోషన్ గురించి చెబుతూ.. ఓ రోజు ఇంటికి దగ్గరలో ఉన్న బ్యూటీ పార్లర్ కి వెళ్లి మసాజ్ చేయించుకుంటున్నాను. అంతలో వాడు ఇంటి నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి మా అమ్మకి ఆయిల్ పెట్టడానికి మీరెవరు.. పెడితే నేను పెట్టాలి కానీ అనుకుంటూ నా చేయి పట్టుకుని ఇంటికి లాక్కెళ్లి పోయాడు అని చెప్పింది.. అలా వాడికి అమ్మ నా సొంతం అనే పొసెసివ్ నెస్ ఉండేది చిన్నప్పుడు. ఇదే టైమ్ లో మరోసారి బుల్లితెర నటుడు ప్రభాకర్ తో కలిసి ఓ టెలీఫిల్మ్ లో నటిస్తున్నాను. ప్రభాకర్ మా వీధి చివర్లో ఉండేవారు.. ఆ టెలీఫిల్మ్ లో మమ్మల్ని చూసి.. అమ్మా ఇప్పుడే వస్తా.. వేసేసి వస్తా అన్నాడు. అలా వాడు చాలా సందర్భాల్లో చాలా సార్లు అలా చేశాడు. అమ్మ నాది అన్న భావనలో ఉండేవాడు.. ఇప్పుడు పెద్దవాడయ్యాడు.. అవన్నీ గుర్తు చేస్తుంటే అవునా.. అలా చేశానా అని అంటుంటాడు అని తన కొడుకు రోషన్ కి తన పట్ల ఉన్న ప్రేమ గురించి వివరించింది సుమ.

Tags

Read MoreRead Less
Next Story