వైరస్ వచ్చినా.. వయస్సు ఆగదంటూ క్వారంటైన్ సెంటర్లో యువత డ్యాన్స్.. వీడియో

వైరస్ వచ్చినా.. వయస్సు ఆగదంటూ క్వారంటైన్ సెంటర్లో యువత డ్యాన్స్.. వీడియో
X

మా బాస్ ఏంటే బాబు మరీ ఛండశాసనుడులా ఉన్నాడు.. ఆదివారం కూడా ఆఫీసుకి రమ్మంటాడు.. ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గరపడుతోంది.. తొక్కా తోలు అనుకుంటూ వారంలో ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వడు అని ఫోన్లో ఫ్రెండ్ తో బాస్ మీద ఉన్న కోపాన్ని వెళ్లగక్కుతుంటారు సాప్ట్ వేర్ యూత్. అంత బిజీగా ఉన్న వారికే పాజిటివ్ వచ్చి 14 రోజులు క్వారంటైన్ లో ఉండమంటే.. పిచ్చెక్కిపోదూ.. సాయింత్రం అయితే క్యాంటిన్లో పిజ్జాలు, బర్గర్లు తింటూ చిట్ చాట్ లు చేస్తూ ఆఫీస్ వర్క్ ని ఆడుతూ పాడుతూ చేసే టెకీలను బంధించి టెస్టులు, మందులు, ఆహార నియమాలు అంటూ కూర్చోబెడితే కాలు ఎలా నిలుస్తుంది.

లక్షణాలు లేకపోయిన పాజిటివ్ వచ్చింది. ఖర్మరా బాబూ ఇంకా ఎన్ని రోజులు ఉండాలో ఈ క్వారంటైన్ లో అని రోజులు లెక్కబెట్టుకుంటున్నారు బళ్లారిలోని కొవిడ్ కేంద్రంలో ఉన్న యువతీ యువకులు. అందరూ కలిసి ఓ సూపర్ ఐడియా ప్లాన్ చేశారు. కర్ణాటకలో బాగా పాపులర్ అయిన హీరో ఉపేంద్ర పాటకి స్టెప్పులేసి అదరగొట్టారు. యువ రక్తం ధాటికి కరోనా కనిపించకుండా పోవాల్సిందేనని నెటజన్లు వీరి డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. ఈ ప్లాష్ మాబ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చూసిన వాళ్లు లైకులు, షేర్లతో వారికి మద్దతు తెలుపుతున్నారు.

Tags

Next Story