నీ మంచితనం నీకు పేరును తీసుకువస్తుంది.. ఉపాసనకు శుభాకాంక్షలు చెప్పిన చెర్రీ

మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్‌చరణ్ భార్య ఉపాసన సోమవారం పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆమెకు సినిమా ప్రముఖుల నుంచి స్పోర్ట్స్ సెలబ్రిటీల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. అయితే, రామ్ చరణ్ తన భార్యకు ఇన్‌స్టాగ్రాంలో విస్ చేశారు. "నీవు చేసే మంచి ప‌నులు నీకు త‌ప్ప‌కుండా పేరును తెచ్చిపెడుతాయి" అని రాసుకొచ్చారు. ఆ పోస్టుకు ఉపాసనా ఫోటో ఒకటి జత చేశారు. కాగా ఆమె బర్తడే సందర్భంగా హీరో రానా, హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, ప‌లువురు సెల‌బ్రిటీలు విష్ చేశారు. అటు, మెగా అబిమానులు పెద్ద ఎత్తున విష్ చేస్తున్నారు. ఆమె ఈరోజు 31వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story