మళ్లీ పెరిగిన డీజిల్ ధర

మళ్లీ పెరిగిన డీజిల్ ధర
X

ఒక‌వైపు క‌రోనా భ‌యం.. మ‌రో వైపు డీజిల్ బాదుడుతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధ‌ర‌ కంటే డీజిల్ ధ‌ర‌ ఎక్కువవుతుండ‌టంతో వాహ‌న‌దారులు ఆందోళన చెందుతున్నారు. రోజువారీ స‌మీక్ష‌లో భాగంగా డీజిల్ ధ‌ర‌ను 12 పైస‌లు పెంచాయి. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ డీజిల్ ధ‌ర 81.64కు చేరింది. పెట్రో ధ‌ర‌లు య‌ధాత‌థంగా ఉండ‌టంతో ప్ర‌స్తుతం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.80.43గా ఉంది. అంటే పెట్రోల్ కంటే డీజిల్ ధ‌ర రూ.1.21 ఎక్కువ‌.

Tags

Next Story