విషం కలిపిన అరటి పండు తినిపించి.. 20 పశువులను చంపేశారు!

విషం కలిపిన అరటి పండు తినిపించి.. 20 పశువులను చంపేశారు!
X

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. అరటి పండులో విషం కలిపి పశువులకు పెట్టారు. ఈ విషం కలిపిన అరటి పండు తిని.. 20 పశువులు మృత్యువాత పడ్డాడు. కొడగు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

ఐగూరు ఎస్టేట్‌ సమీపంలోని గ్రామాల నుంచి నిత్యం పశువులు మేతకు వెళ్లేవి. గ్రామ సమీపంలోని కాఫీ తోటలోకి పశువులు వెళ్లి పంటను నాశనం చేస్తున్నాయని కాఫీ తోట మేనేజర్‌, సిబ్బంది కలిసి దారుణానికి ఒడిగట్టారు. అరటి పండులో విషం కలిపి పశువులకు తినిపించేవారు. ఆ విషం తిన్న పశువులు చనిపోయేవి. విషయం బయటికి తెలయకుండా వాటిని తోటలోనే గొయ్యి తీసి పూడ్చేవారు. ఇలా 20 పశువులను చంపేశారు.

పశువులు కనిపించడంలేదని యజమానులు ఆదివారం గ్రామ చుట్టుపక్కల వెతుక్కుంటూ కాఫీ తోట వైపుకు వెళ్లారు. అక్కడ పశువుల కళేబరాలు కనిపించడంతో తోట సిబ్బందిని నిలదీశారు. దీంతో అపలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story