జులై 31 వరకు పశ్చిమ బెంగాల్‌లో లాక్‌డౌన్

పశ్చిమ బెంగాల్ లో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఇక కలకత్తాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ర్టవ్యాప్తంగా ఉన్న కంటైనింగ్ జోన్ ఆధారిత కొవిడ్-19 లాక్‌డౌన్ జులై 31 వరకు కొనసాగుతుందని రాష్ట్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన నోట్‌లో డీఎంలు, డీజీపీ, సీపీ కొల్‌కతాకు సలహా ఇచ్చింది. 'స్థానిక పరిస్థితిని బట్టి పట్టణం, జోన్ల వారీగా డీఎంలు లాక్‌డౌన్ కొనసాగించవచ్చు. ఐదు నుంచి ఏడు రోజుల పాటు నిర్ణయం తీసుకోవచ్చు' అని చెప్పింది. 'రాష్ట్రవ్యాప్తంగా కంటైనింగ్ జోన్ ఆధారిత లాక్ డౌన్ జూలై 31 వరకు కొనసాగుతుందని' తెలిపింది.
కాగా, పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ర్టవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 42,487కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 36 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,112కి చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com