నైజీరియా విదేశాంగ మంత్రికి క‌రోనా పాజిటివ్

నైజీరియా విదేశాంగ మంత్రికి క‌రోనా పాజిటివ్
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తోంది. సామన్యుల నుంచి దేశాధినేతల వరకు ఏవరినీ ఈ మహమ్మారి వదలటం లేదు. తాజాగా నైజీరియా విదేశాంగ మంత్రి జెఫ్రీ ఒన్యామాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఆదివారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో ఆయ‌న‌కు పాజిటివ్ వ‌చ్చింది. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాల్లో కనిపించటంతో ప‌రీక్ష‌లు చేయించుకున్నాని, పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆయన ట్వీట్ చేశారు. మంచి జ‌ర‌గాల‌ని దేవున్ని ప్రార్ధిస్తున్నాని ట్వీట్ చేశారు.

కాగా, నైజీరియాలో ఇప్ప‌టివ‌ర‌కు 36,107 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దేశవ్యాప్తంగా క‌రోనా మహమ్మారి బారిన పడి 778 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story