ఉత్తరాఖండ్‌లో వరద భీభత్సం.. ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌లో వరద భీభత్సం.. ముగ్గురు మృతి
X

ఉత్తరాఖండ్‌లో వరద భీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వరదలు ప్రవహిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని పితోరాఘడ్ జిల్లా మడ్‌కట్ గ్రామంలో వరదనీటిలో చిక్కుకొని ముగ్గురు ప్రాణాలు కొల్పోయారు. భారీగా ప్రవహిస్తున్న వరదల్లో మరో 11 మంది గల్లంతయ్యారు.గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

Tags

Next Story