తెలంగాణలో భారీ వర్షాలు!

X
తెలంగాణలో పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల వరకు ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే మూడురోజులు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
