సచిన్ పైలట్ నాకు రూ .35 కోట్లు ఇచ్చారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

రాజస్థాన్ రాజకీయ గందరగోళం మధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా మలింగ తనకు సచిన్ పైలట్ డబ్బు ఇవ్వజూపాడని ఆరోపించారు. అయితే తాను వెంటనే ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చానని.. డిసెంబరులో ఈ వ్యవహారం జరిగిందని అన్నారు. అప్పుడు తన ఇంటివద్ద సచిన్ ను కలిసినట్టు చెప్పారు. ఆ సమయంలోనే ఈ ఆఫర్ ఇచ్చారని.. ఆ తరువాత రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కూడా ఈ చర్చ జరిగిందని అన్నారు.
అయితే ఈ విషయంలో తాను ఎవరి ఫోన్ కాల్ రికార్డు చేయలేదని.. అసలు ఎలా రికార్డ్ చేయాలో కూడా తనకు తెలియదని మలింగ చెప్పారు. అంతేకాదు బిజెపి తనను ఎప్పుడూ సంప్రదించలేదని. పార్టీ మారడానికి సచిన్ పైలట్ తనకు రూ.35 కోట్లు ఇచ్చాడని.. అయితే ఆ డబ్బు తీసుకునేందుకు నిరాకరించానని అన్నారు. ఆ సమయంలో తనతో సచిన్ సంప్రదించినట్టు ముఖ్యమంత్రికి కూడా చెప్పానని అన్నారు. అప్పుడే బిజెపికి వెళ్లడం ఇష్టం లేదని సచిన్ కు స్పష్టంగా చెప్పానన్నారు. శివాలయంలోని విగ్రహం మీద ఒట్టు వేసి ఈ విషయం చెప్పగలనని.. దర్యాప్తు సంస్థలు వచ్చినా, వారికి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com