అయోధ్య ఆలయ రూపకల్పనలో భారీ మార్పు..

అయోధ్య ఆలయ రూపకల్పనలో భారీ మార్పు..
X

సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న దాదాపు 9 నెలల తరువాత ఆగస్టు 5న అయోధ్యలో రామాలయం నిర్మాణానికి.. భూమిపూజ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అయోధ్యలో ఇటీవల శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సమావేశం జరిగింది. ఇందులో, ఆలయ రూపంలో భారీ మార్పు చేశారు.. ఆలయ ఎత్తు 128 అడుగుల నుండి 161 అడుగులకు పెంచారు. అంతేకాదు ఈ ఆలయ నిర్మాణం 67 ఎకరాల నుండి 120 ఎకరాలకు విస్తరించాలని నిర్ణయించారు.

ఆలయ నిర్మాణానికి సుమారు రూ .100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే, ఆలయ వాస్తుశిల్పి చంద్రకాంత్ సోంపురా మాట్లాడుతూ.. బడ్జెట్ ఎంత ఖర్చవుతుందో అంచనా వేయడం కష్టమని అన్నారు. ఆలయ నిర్మాణంలో ప్రభుత్వం నుండి విరాళాలు తీసుకోబోమని ట్రస్ట్ ఇప్పటికే స్పష్టం చేసింది. అటువంటి పరిస్థితిలో, ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయాలలో అయోధ్య రామాలయాన్ని చేర్చడానికి బడ్జెట్ ఎక్కడినుంచి వస్తుందనేదే అందరి ప్రశ్న. కానీ విరాళాలు రూపంలో సేకరించాలని గతంలోనే ట్రస్ట్ నిర్ణయించింది.

దీంతో లాక్డౌన్ సమయంలో పాట్నాలోని హనుమాన్ ఆలయానికి చెందిన మహావీర్ ట్రస్ట్ నుంచి అత్యధికంగా 2 కోట్ల రూపాయల విరాళం వచ్చిందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ట్రస్ట్ లో ఎంత ఉన్నాయనే దానిమీద స్పష్టమైన గణాంకాలు లేనప్పటికీ.. ట్రస్ట్ ఏర్పడినప్పటి నుండి, దాదాపు 4 కోట్ల విరాళాలు అందాయని అంచనా వేశారు. మాజీ ట్రస్ట్ ఉన్న సమయంలో సుమారు 10 కోట్ల రూపాయలు అందులో ఉన్నాయి. ఈ ట్రస్ట్‌లో ప్రస్తుతం సుమారు 14 కోట్ల మంది విరాళం ఇచ్చారు. కాగా ఆలయం నిర్మించడానికి ఎంత సమయం పట్టిందనే విషయంపై కూడా చర్చించారు. మూడున్నర సంవత్సరాలకు మించి తీసుకోకూడదని ఆలయ నిర్మాణదారులతో

ట్రస్ట్ సభ్యులు చర్చించారు.

Tags

Next Story