గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న సంగమేశ్వరుడు

గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న సంగమేశ్వరుడు
X

జూరాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయానికి నీటిమట్టం పెరుగుతోంది. కృష్ణా జలాల వరద ప్రవాహం డ్యామ్ లోకి కోనసాగుతోంది. శ్రీశైలం డ్యామ్ లో క్రమంగా నీటిమట్టం పెరుగుతూ రేడీఎల్ క్రస్ట్ గేట్లను తాకాయి. డ్యామ్ లోకి 78 వేల నాలుగు వందల 92 కుసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. గరిష్ఠనీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 839.40 అడుగుల మేర నీరు చేరింది. గరిష్ట నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం సుమారు 61 టీఎంసీల నీరు ఉంది. జూరాల నుంచి వరద నీరు చేరుతుండడంతో కర్నూల్ జిల్లాలోని చారిత్రిక ఆలయం నీటమునుగుతుంది. ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు రావడంతో సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్నాడు.

ఆత్మకూరు పరిధిలోని సప్త నదుల సంగమేశ్వర ఆలయం ఎంతో చారిత్రాత్మకమైన దేవాలయం. కృష్ణా, తుంగభద్ర, ఇలా ఏడూ నదులు ఒకేచోట కలుస్తాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని సప్తనదుల సంగమం అంటారు. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఏడు నదులు కలిసే చోట ఆలయమే సంగమేశ్వర దేవాలయం. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఏ శివాలయానికి వెళ్లినా శివలింగం రాతితో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం శివలింగం వేపకొమ్మతో ఉంటుంది. పాండవులు వనవాసంలో పూజ చేసుకోవడానికి వేపచెట్టు కొమ్మని ఇక్కడ ప్రతిష్టించి పూజలు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. నాటినుంచి నేటి వరకూ ఆలయంలో వేప శివలింగం అలానే మనకు కనిపిస్తుంది.

Tags

Next Story