ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. లోకేష్ సంతాపం

ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..  లోకేష్ సంతాపం
X

టీడీపీ సీనియర్ నాయకుడు, విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళావారం విశాఖపట్నంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2009లో కాంగ్రెస్ తరఫున కురుపాం ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. ఆ తరువాత టీడీపీలో చేరి.. 2014-19 ఎన్నికల్లో పోటీచేశారు. మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు జనార్థన్ థాట్రాజ్ స్వయానా మేనల్లుడు. జనార్థన్ థాట్రాజ్ మరణంతో టీడీపీ కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. జనార్ధన్ థాట్రాజ్ మృతి పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Tags

Next Story