అద్వానీ వాంగ్మూలం తీసుకోనున్న సీబీఐ కోర్టు

1992 బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 92 ఏళ్ల మాజీ ఉప ప్రధాని ఎల్కె అద్వానీ వాంగ్మూలం జూలై 24 న నమోదు చేయాలనీ ప్రత్యేక సిబిఐ కోర్టు సోమవారం నిర్ణయించింది. సిఆర్‌పిసి సెక్షన్ 313 కింద వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు సిబిఐ అధికారులు. అలాగే మరో బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి వాంగ్మూలాన్ని కూడా వీడియో
కాన్ఫరెన్సింగ్ ద్వారా జూలై 23 న రికార్డ్ చేసినందుకు సిబిఐ కోర్ట్ స్పెషల్ జడ్జి ఎస్కె యాదవ్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 31 లోగా విచారణ చెయ్యాలని సిబిఐ ప్రత్యేక కోర్ట్ నిర్ణయించింది. కాగా, బాబ్రీ మసీదు కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి.. వంటివారి పేర్లు ఉన్న సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

