వాయినానికి మా ఇంటికి రావొద్దు..

వాయినానికి మా ఇంటికి రావొద్దు..
X

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వాయినానికి మా ఇంటికి రావద్దంటూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గనిపూడికి చెందిన యామిజాల శేషు కుటుంబం ఇంటికి ఇలా ప్లెక్సీ పెట్టారు. తాము ఈ సంవత్సరం వ్రతాలు నోములు చేయడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.

వాయినం కోసం వచ్చే వారిని తిరిగి వెళ్లిపొమ్మని నోటితో చెప్పలేకనే ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని అన్నారు యామిజాల శేషు. శ్రావణమాసం ప్రారంభం అవుతున్న వేళ శ్రావణ మంగళగౌరి వ్రతాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జనం గుమిగూడి ఈ వ్రతాలకు దూరంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశామన్నారు.

Tags

Next Story