బ్రెజిల్‌లో కరోనా విస్ఫోటనం.. 24 గంటల్లో కొత్త కేసులు చూస్తే..

బ్రెజిల్‌లో కరోనా విస్ఫోటనం.. 24 గంటల్లో కొత్త కేసులు చూస్తే..
X

లాటిన్ అమెరికన్ దేశం బ్రెజిల్‌లో 24 గంటల్లో 23,529 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ కరోనా సోకిన వారి సంఖ్య 21 లక్షలకు చేరుకుంది. ఒకే రోజులో 716 మంది మరణించారు. దాంతో మృతుల సంఖ్య 79,488 కు చేరింది. బ్రెజిల్‌లో 1.4 మిలియన్లకు పైగా ప్రజలు సంక్రమణ నుండి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఎక్కువగా ప్రభావితమైన సావో పాలో నగరంలో ఇప్పటివరకు 4 లక్షల కేసులు నిర్ధారించగా, 19,732 మంది మరణించారు. కాగా కరోనా వైరస్ కు ఎక్కువగా ప్రభావితం అయిన దేశాలలో అమెరికా తరువాతి స్థానంలో నిలిచింది బ్రెజిల్. ఇక్కడ ప్రతిరోజు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

Tags

Next Story