లాభాలు ఉన్నా 280 అవుట్‌లెట్లను మూసివేసిన కేఫ్ కాఫీ డే

కేఫ్ కాఫీ డే (సిసిడి) ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 280 అవుట్లెట్లను మూసివేసింది. దీనితో కంపెనీ మొత్తం అవుట్‌లెట్ల సంఖ్య 1,480 కి పడిపోయింది. 30 జూన్ 2020 నాటికి మొత్తం రెస్టారెంట్ల సంఖ్య 1,480 కి తగ్గిందని, 280 అవుట్‌లెట్లు మూసివేసినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
కేఫ్ కాఫీ డే బ్రాండ్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (సిడిఇఎల్) దాని అనుబంధ సంస్థ కాఫీ డే గ్లోబల్ యాజమాన్యంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో 15,739 నుండి ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సగటు రోజువారీ అమ్మకాలు 15,445 కు పడిపోయాయని కంపెనీ తెలిపింది. అయితే, ఈ త్రైమాసికంలో విక్రయ యంత్రాల సంఖ్య 59 వేల 115 కు పెరిగింది. ఏడాది క్రితం దీని సంఖ్య 49 వేల 397 గా ఉంది.
కేఫ్ కాఫీ డేని నిర్వహిస్తున్న కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (మార్చి-జూన్) రూ. 1,672.41 కోట్ల నికర లాభం పొందింది. గతంతో పోల్చుకుంటే 90 శాతం పెరిగింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఈ లాభం కేవలం 21.06 కోట్లు. అయితే, ఈసారి కంపెనీలో వాటాను అమ్మడం వల్ల భారీగా లాభాలు వచ్చాయి. స్టాక్ ఎక్స్ఛేంజ్ కు ఇచ్చిన సమాచారంలో, గత ఒక సంవత్సరంలో మైండ్ట్రీలో తన వాటాను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

