కరోనా విజృంభణ.. వారంలో రెండు స్థానాలు ఎగబాకిన ఆ దేశం..

X
దక్షిణాఫ్రికాలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. అక్కడ మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా.. కేసులు మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ కేవలం పట్టణ ప్రాంతాలలోనే కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని.. పల్లెల్లో అంత ప్రభావం లేదని అంటున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గత 24 గంటల్లో 85 మంది మరణించారు.
దాంతో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,033 కు చేరింది, అలాగే కేసుల సంఖ్య ఇప్పటివరకు 3 లక్షల 64 వేల 328 గా నమోదైంది. గత వారం దక్షిణాఫ్రికా సంక్రమణ పరంగా ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది. అయితే ఈ వారంలో ఇది ఐదవ స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ కరోనా కేసులు చాలా వేగంగా వస్తున్నట్టు అర్ధమవుతుందంటున్నారు పరిశీలకులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
