గన్నవరం వైసీపీలో ముసలం

గన్నవరం వైసీపీలో ముసలం
X

కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీలో ముసలం పుట్టింది. పాత కొత్తనేతల మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు తలెత్తాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలపై గుర్రుగా ఉన్న పాత నేతలు వారివల్ల నియోజకావర్గంలో అరాచకం పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీలోని ఓ కీలక నేతను కలిసిన నాయకులు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి సహకరించేది లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ ఉపఎన్నిక జరిగినా తాము సహకరించబోమని కుండబద్ధలు కొట్టారు. వారి ఆవేదనను విన్న కీలక నేత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. విషయాన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అనుకూల నిర్ణయం వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.

Tags

Next Story