కేసులు యాభైవేలున్నా.. మరణాలు 409 మాత్రమే..

కేసులు యాభైవేలున్నా.. మరణాలు 409 మాత్రమే..

ఇజ్రాయెల్‌లో 24 గంటల్లో 670 కొత్త కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు వచ్చాయి. దీంతో రోగుల సంఖ్య 50,035 కు పెరిగింది. అంటువ్యాధిని చాలావరకు నియంత్రించిన ప్రపంచంలోని అతికొద్ది దేశాలలో ఇజ్రాయెల్ ఒకటి, అయితే గత కొన్ని రోజులుగా కొత్త కేసుల పెరుగుదల కనిపించింది. ఇక్కడ వారం రోజుల కిందటి వరకూ వైరస్ తీవ్రత తగ్గిందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు రోజూ 500 లకు పైగా కేసులు రావడంతో ప్రజలలో మళ్ళీ ఆందోళన మొదలయింది. వీలైతే మరోసారి పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇక్కడ ఊరట కలిగించే విశేషం ఏమిటంటే..

యాభైవేల కేసులు నమోదయినప్పటికీ దేశవ్యాప్తంగా ఇక్కడ కేవలం 409 మంది మాత్రమే మరణించారు. డెత్ రేట్ చాలా తక్కువగా ఉండటంతో ఆ దేశ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక దేశంలో ఇప్పటివరకు 21,589 మంది పూర్తిగా కోలుకున్నారు. మరోవైపు కరోనా సంక్షోభం నుండి ఆర్ధికంగా వీలైనంత త్వరగా కోలుకోవాలని భావిస్తున్న ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు.. దేశంలో తయారైన వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వమని సూచనలు చేశారు, తద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story