ఒక్క వైరస్ కూడా లేని 12 దేశాలు.. ఏం చేసి వైరస్ ని తమ దేశంలోకి రాకుండా నిరోధించాయి..

ఒక్క వైరస్ కూడా లేని 12 దేశాలు.. ఏం చేసి వైరస్ ని తమ దేశంలోకి రాకుండా నిరోధించాయి..

డిసెంబర్ 2019 లో కరోనా వైరస్ చైనాలో ప్రాణం పోసుకుంది. కొన్ని వారాల తరువాత కొవిడ్-19 అని పిలవబడే అనారోగ్యానికి కారణమయ్యే వైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారింది. శ్వాసకోశ అనారోగ్యానికి దారితీసే ఈ వైరస్ ఇప్పుడు కనీసం 188 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ఆరోగ్య అధికారులు, ప్రభుత్వాలు పౌరులను శారీరక దూరం పాటించమని ప్రోత్సహించాయి.అవసరమైతే తప్ప బయటికి వెళ్లడాన్ని మానుకోమని చెప్పాయి.

జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం సమాచారం ప్రకారం 13 మిలియన్లకు పైగా ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్త మరణాల సంఖ్య 578,000 కన్నా ఎక్కువ. 7.3 మిలియన్లకు పైగా రోగులు కోలుకున్నారు. కరోనావైరస్ యొక్క కేసులను ఇప్పటివరకు నమోదు చేసుకోని కొన్ని దేశాలు ఉన్నాయంటే నమ్మడం చాలా కష్టం. వైరస్ వ్యాప్తి మనందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ప్రపంచమంతటా వ్యాపించిన వేగం ఆందోళనకరమైనది.

కరోనా వైరస్ లేని దేశాలను యుఎన్ అధికారికంగా గుర్తించింది. జూలై 19 2020 నాటికి 12 దేశాలలో కొవిడ్ నామ మాత్రంగానైనా లేదని తెలుసుకున్నారు. ఈ దేశాలలో చాలా వరకు ఓషియానియాలోని పసిఫిక్ ద్వీప దేశాలు.

కరోనా వైరస్ లేని దేశాల జాబితా

1. ఉత్తర కొరియా 2. తుర్క్మెనిస్తాన్ 3. సోలమన్ దీవులు 4. వనాటు 5. సమోవా 6. కిరిబాటి 7. ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా 8. టోంగా 9. మార్షల్ దీవులు 10. పలావు 11. తువలు 12. నౌరు

ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ మందికి పైగా ప్రజలను ప్రభావితం చేసిన వైరస్ కేసులు లేని అతి కొద్ది మందిలో ఈ దేశాలు ఎలా ఉన్నాయి?

కరోనావైరస్ లేని దేశాలను మరింత వివరంగా తెలుసుకుందాం.

1. ఉత్తర కొరియా, ఆసియా (జనాభా: 25,778,816)

సరిహద్దులను మూసివేసిన మొదటి దేశం ఉత్తర కొరియా. చైనాకి పొరుగు దేశంగా ఉన్న ఉత్తర కొరియా జనవరి 21 న సరిహద్దులను మూసివేసింది అప్పటి నుండి తిరిగి తెరవలేదు. దేశంలోకి వచ్చేవారిపై కఠినమైన చర్యలను అమలు చేసింది.

2. తుర్క్మెనిస్తాన్, ఆసియా (జనాభా: 6,031,200)

తుర్క్మెనిస్తాన్ మధ్య ఆసియాలో కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న దేశం - కరోనావైరస్ సంక్రమణ నివేదికలు ఉన్న అన్ని దేశాలు. చాలావరకు భూ సరిహద్దులు ఒక నెల క్రితం మూసివేయబడ్డాయి. ఫిబ్రవరి ఆరంభంలో తుర్క్మెనిస్తాన్ చైనాకు బయలుదేరే అనేక విమానాలను రద్దు చేసింది.

3. సోలమన్ దీవులు, ఓషియానియా (జనాభా: 686,884)

ప్రపంచంలో అతి తక్కువ మంది జనాభా సందర్శించే దేశాలలో సోలమన్ దీవులు ఒకటి. ఫిబ్రవరి ఆరంభం నుండి అనేక పసిఫిక్ ద్వీప దేశాల మాదిరిగా, సోలమన్ దీవులను సందర్శించాలంటే వైద్యులు జారీచేసిన ధృవీకరణ పత్రం అవసరం. ఒకవేళ వైరస్ సోకిన దేశాల నుండి ప్రయాణికులు ప్రవేశిస్తే వారు కచ్చితంగా 14 రోజుల నిర్భంధం అనంతరమే సందర్శించాల్సి ఉంటుంది.

4. వనాటు, ఓషియానియా (జనాభా: 307,145)

వనాటులో ఎటువంటి కేసులు లేవు అయినా ఫిబ్రవరి నుండి విదేశాల నుండి వచ్చేవారికి కఠినమైన విధానాలను అమలు చేశాయి. వైరస్ సోకిన దేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు అనుమతి లేదు. ఒకవేళ వస్తే 14 రోజుల గృహ నిర్భంధం, వైద్యుల ధృవీకరణ పత్రం చూపించాలి.

5. సమోవా, ఓషియానియా (జనాభా: 198,413)

సమోవా మార్చి 25 నుండి లాక్డౌన్లో ఉంది. దేశంలో అంతర్జాతీయ విమానాలకు అనుమతి లేదు.

6. కిరిబాటి, ఓషియానియా (జనాభా: 119,451)

కిరిబాటిలో ఎటువంటి కేసులు లేవు, కాని ప్రజా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మార్చి 30 నుండి పాఠశాలలు 2 వారాల పాటు మూసివేయబడ్డాయి.

7. ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, ఓషియానియా (జనాభా: 115,030)

చైనా పౌరులకు తమ దేశంలో ప్రవేశం నిషేధం.

8. టోంగా, ఓషియానియా (జనాభా: 105,695)

టోంగా ఫిబ్రవరి నుండి ప్రయాణ నిబంధనలను కఠినతరం చేసింది. సరిహద్దులను మూసివేసింది వారి స్వంత దేశాలకు తిరిగి విమానాలలో ప్రయాణిస్తున్న విదేశీయులను మాత్రమే బయలుదేరడానికి అనుమతించింది. మార్చి 29 నాటికి, టోంగా లాక్డౌన్లో ఉంది. 8 అనుమానాస్పద కేసులు పరీక్షించగా అన్నీ నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

9. మార్షల్ దీవులు, ఓషియానియా (జనాభా: 59,190)

మార్చి 21 న మార్షల్ దీవులతో ఉన్న ఏకైక అంతర్జాతీయ విమాన కనెక్షన్ తాత్కాలికంగా కనీసం 3 వారాల పాటు సేవలను నిలిపివేసినట్లు తెలిసింది.

10. పలావు, ఓషియానియా (జనాభా: 18,094)

పలావులో కరోనా వైరస్ కేసూ లేదు.

11. తువలు, ఓషియానియా (జనాభా: 11,793)

ప్రపంచంలో కనీసం సందర్శించని దేశాలలో ఒకటిగా తరచుగా పిలువబడే తువాలు సంవత్సరానికి 200 కంటే తక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. చాలా తక్కువ జనాభా ఉన్న ఈ దేశంలో వ్యాప్తిని నివారించడంలో అన్ని చర్యలు అవలంభించింది.

12. నౌరు, ఓషియానియా (జనాభా: 10,823)

నౌరు, ఈ దేశాన్ని ఒక్క రోజులో చుట్టి రావచ్చు. అంత చిన్న దేశం ఇది. అందేకేనేమో కరోనా వైరస్ రహితంగా ఉండగలిగింది. టువాలుతో పాటు, ప్రపంచంలో అతి తక్కువ మంది ప్రయాణీకులు సందర్శించిన దేశాలలో ఇది ఒకటి.

Tags

Read MoreRead Less
Next Story