రేపు రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 61 మంది సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు,

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు లేనందువల్ల మొదటిసారిగా పార్లమెంటు లోపల ఉన్న ఛాంబర్ లో ఎంపీల ప్రమాణస్వీకారం జరుగుతుంది. సాధారణంగా పార్లమెంటు సెషన్‌లో లేనప్పుడు ప్రమాణస్వీకారం లేదా ధృవీకరణకు సభ్యత్వం పొందే కార్యక్రమం చైర్మన్ గదిలో జరుగుతుంది. కానీ ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల కారణంగా మొదటిసారి చాంబర్ లో జరుగుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రతి సభ్యుడికి ఒక అతిథిని మాత్రమే వారితో పాటు అనుమతించినట్టు రాజ్యసభ అధికారులు తెలిపారు. ఎంపీ లు ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

Tags

Next Story