ఆ రాష్ట్రాల్లో వ‌చ్చే నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం!

ఆ రాష్ట్రాల్లో వ‌చ్చే నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం!
X

ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ శాఖమంగ‌ళ‌వారం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో బీహార్‌, ప‌శ్చిమ బెంగాల్‌, అసోంల‌లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, యూపీల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉంటాయని తెలిపింది.

కాగా, అసోంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌చ్చిన వ‌ర‌ద‌లు ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 24ల‌క్ష‌ల మందిని ప్ర‌భావితం చేశాయి. ఇప్పటి వరకు వరదల కార‌ణంగా 85 మంది మృతి చెందారు. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో 26 మంది మృత్యువాత‌ప‌డ్డారు. హిమాచల్‌ప్ర‌దేశ్‌లోనూ గ‌త 24 గంట‌ల్లో విస్తారంగా వ‌ర్షాలు కురిశాయి.

Tags

Next Story