రాజీవ్ గాంధీ హత్యకేసు నిందితురాలు నళిని ఆత్మహత్యాయత్నం

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ జైలులో ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. గత రాత్రి వెల్లూరులోని మహిళల ప్రత్యేక జైలులో ఉన్న నళిని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్టు జైలు అధికారులు తెలిపారు. తోటి ఖైదీతో గొడవ కారణంగా ఆమె ఇలా చేసినట్టు తెలుస్తోంది. తోటి మహిళా ఖైదీతో గొడవ నేపథ్యంలో జైలర్ సమక్షంలో ఆమె వస్త్రాన్ని గొంతుకు చుట్టుకున్నట్టు తనకు తెలిసిందని నళిని తరపు న్యాయవాది పి పుగజేండి పేర్కొన్నారు. కాగా చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధానిపై మానవ బాంబు దాడిలో కేసులో ఆమెను 1991లో అరెస్ట్ చేశారు. దీంతో 29 ఏళ్లుగా ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
ఈ కేసులో ఆమెతోపాటు మరో ఆరుగురు దోషులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వారిని విడుదల చెయ్యాలని తమిళనాడు కేబినెట్ సిఫారసు చేసినా.. రాష్ట్ర గవర్నర్ ఈ సిఫారసును నిలిపివేశారు.. దాంతో ఏడుగురు దోషులను విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు. గత ఏడాది జూలైలో, తన కుమార్తె వివాహం కోసం ఏర్పాట్లు చేసుకోవడానికి ఆమెను పెరోల్‌పై విడుదల చేశారు. ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య వెల్లూరు నగర శివారులోని రంగపురంలో ఉన్న ఇంట్లో ఒక నెల ఉన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

