పైలట్ క్యాంప్ పిటిషన్ పై నేడు తీర్పు?

స్పీకర్ నోటీసుకు వ్యతిరేకంగా పైలట్ క్యాంప్ పిటిషన్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసందే. దీనిపై ఈ రోజు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఉదయం 10.30 గంటలకు హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది. కోర్టులో సోమవారం జరిగిన విచారణ సందర్భంగా అభిషేక్ మను సింగ్వి స్పీకర్ సిపి జోషి తరపున వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసు పంపారని సింగ్వి తెలిపారు. అయితే ఈ నోటీసులు వారిని అనర్హులుగా చేయడం కోసం కాదని.. పైలట్ క్యాంప్ పిటిషన్ తిరస్కరించాలని ఆయన అన్నారు.
మరోవైపు పైలట్ వర్గం తరపున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రభుత్వాన్ని పడగొట్టడం వేరే విషయమని, ముఖ్యమంత్రిని చేయడం మరో విషయం అని సాల్వే వాదించారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేయడం లేదని వాదించారు. కాగా అంతకుముందు శుక్రవారం, శాసనసభ వెలుపల జరిగిన కార్యకలాపాలను ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ఉల్లంఘనగా పరిగణించలేమని ఆయన అన్నారు. సెషన్ కూడా అమలులో లేదు కాబట్టి విప్‌కు అర్థం లేదని అన్నారు.
అసెంబ్లీలో చీఫ్ విప్ మహేష్ జోషి ఫిర్యాదుపై, అసెంబ్లీ స్పీకర్ సిపి జోషి జూలై 14 న పైలట్తో సహా 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసు జారీ చేశారు. గత వారం జరిగిన విచారణలో, ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసుపై స్పీకర్ జూలై 21 వరకు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది హైకోర్టు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

