సారా సచిన్ పైలట్ పేరుతో ట్వీట్ వైరల్.. బీజేపీలోకి..

సారా సచిన్ పైలట్ పేరుతో ట్వీట్ వైరల్.. బీజేపీలోకి..
X

సచిన్ పైలట్ భార్య సారా సచిన్ పైలట్ పేరుతో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో సచిన్ పైలట్ బిజెపిలో చేరాలని సారా కోరుకుంటుందని పేర్కొన్నారు. అయితే ఈ ట్విట్టర్ సారా కు చెందినది కాదని తెలుస్తోంది. కొందరు వ్యక్తులు కావాలనే ఇలా ఫేక్ ట్విట్టర్ అకౌంట్ సృష్టించి ట్వీట్ చేసినట్టు అర్ధమవుతోంది. ఎందుకంటే సారా ఒక పొలిటికల్ సెలబ్రిటీ.. ఈ నేపథ్యంలో ఆమెకు చెందిన ఏ సోషల్ మీడియా అకౌంట్ అయినా కూడా బ్లూ టిక్ ను కలిగి ఉంటుంది.

అయితే ఈ వైరల్ ట్విటర్ హ్యాండిల్ కు మాత్రం బ్లూ టిక్ లేకుండా ఉంది. అందుచేత ఇది ఫేక్ ట్విట్టర్ అకౌంట్ గా చూడాలని అంటున్నారు సోషల్ మీడియా నిపుణులు. కాగా సారా సచిన్ పైలట్ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు స్వయానా సోదరి. విదేశాల్లో చదువుకున్న రోజులలో సచిన్, సారా ఇద్దరు ప్రేమలో పడ్డారు.. అనంతరం మతాలు వేరైనా ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు.

ఇదిలావుంటే రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ గందరగోళాల మధ్య సచిన్ పైలట్ బిజెపిలో చేరడంపై నిరంతరం ఊహాగానాలు వస్తున్నాయి. అయితే సచిన్ పైలట్ కూడా తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టత ఇచ్చారు.

Tags

Next Story