క్వారంటైన్‌కు అంగీకరిస్తేనే ప్రయాణానికి అనుమతి

క్వారంటైన్‌కు అంగీకరిస్తేనే ప్రయాణానికి అనుమతి
X

వందేభారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయలను ప్రభుత్వం స్వదేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, విమాణాల ద్వారా తీసుకొని వస్తున్న ప్రయాణికులను 7 రోజుల పెయిడ్ క్వారంటైన్ కు తరలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారు వారంరోజులు సంస్థాగత పెయిడ్ క్వారంటైన్, మరో వారం రోజులు హోం క్వారంటైన్ లో తప్పనిసరిగా ఉండాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ తాజా ఆదేశాలు జారీ చేసింది. క్వారంటైన్ కు అంగీకరిస్తేనే వందేభారత్ మిషన్, రాయబార కార్యాలయాల్లో విమాన ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించారు. విదేశాల నుంచి ఢిల్లీకి వస్తున్న ప్రయాణికులకు అధికారులు పరీక్షలు జరిపిస్తున్నారు.

Tags

Next Story