ఓ కూలీకి దొరికిన రూ. 50లక్షల విలువైన వజ్రం

ఓ కూలీకి దొరికిన రూ. 50లక్షల విలువైన వజ్రం
X

మధ్యప్రదేశ్‌లో ఓ కూలీకి యాభై లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. పన్నా జిల్లాలోని రాణిపుర గనిలో ఈ ఘటన జరిగింది. వజ్రాల వేటకు వెళ్లిన ఆనందిలాల్ కుష్వాహకు 10.69 కేరట్ల వజ్రం లభించింది. దాని విలువ రూ.50లక్షలు ఉంటుందని జిల్లా డైమండ్ ఆఫీసర్ ఆర్కే పాండే చెప్పారు. రాణిపూర్ ప్రాంతంలోని భూమికి అనందిలాల్ కుష్వాహకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది. గతంలో కూడా ఆయనకు ఒక వజ్రం లభించింది. లాక్ డౌన్ సమయంలో రెండు వజ్రాలు దొరికాయని అధికారులు చెప్పారు.

Tags

Next Story