గుడ్‌ బై.. వెళ్లిపోతున్నా: నటి

గుడ్‌ బై.. వెళ్లిపోతున్నా: నటి

కన్నడ బిగ్ బాస్ 3 పోటీదారు జయశ్రీ రామయ్య బుధవారం ఉదయం ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టుతో అభిమానులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు.'నేను వెళ్లిపోతున్నా. ఈ ప్రపంచానికి, డిప్రెషన్‌కు గుడ్‌ బై' అంటూ జయశ్రీ రామయ్య పోస్టు చేశారు. ఆ తరువాత సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ వెంటనే ఆమె పోస్ట్ వైపు దృష్టిని ఆకర్షించారు.. ఎటువంటి అఘాయిత్యం చేసుకోవద్దని సూచించారు.. ఆమె స్నేహితులు, పరిచయస్తులు ఫోన్ ద్వారా సంప్రదించడం ప్రారంభించారు, ఎవరి కాల్స్ రిసీవ్ చేసుకొని జయశ్రీ రామయ్య కొన్ని గంటల తరువాత, ఆ పోస్టును పేస్ బుక్ నుండి తీసివేసి, "నేను బాగానే ఉన్నాను, సురక్షితంగా ఉన్నాను !! మీ అందరినీ ప్రేమిస్తున్నాను" అంటూ మరో పోస్టు పెట్టారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అవకాశాలు లేకపోవడంతో ఆమె ఇటీవలే తన స్వస్థలానికి వెళ్లిన జయశ్రీ.. తాను డిప్రెషన్‌లో కూరుకుపోయానని, ఇకపై ప్రపంచాన్ని విడిచి వెళ్తున్నట్లు ఫేస్‌బుక్‌లో బుధవారం ఉదయం పోస్టు పెట్టారు. దీనిపై ఆమె స్నేహితురాలు, నటి అద్వైతీ శెట్టి ఇలా వ్యాఖ్యానించారు, ఎప్పుడు బలంగా ఉండాలని.. ఏ సమస్య వచ్చినా దైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. కాగా జయశ్రీ గత కొన్నాళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారని అద్వైతీ శెట్టి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story