మంత్రులుగా ప్రమాణం చేసిన అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ

మంత్రులుగా ప్రమాణం చేసిన అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ
X

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ విజయవాడలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.29 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ప్రమాణం చేయించారు. ముందుగా చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రమాణం చేయగా.. ఆ తరువాత సీదిరి అప్పలరాజు ప్రమాణం చేశారు. వేణుగోపాల కృష్ణ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. సీదిరి అప్పలరాజు కూడా పలాస నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. వీరిద్దరికి ఇవాళ శాఖలు కేటాయించనున్నారు.

Tags

Next Story