ఆ షేర్లే ఆయనకు కోట్లు కురిపించాయి

ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా మూడు నెలల్లో షేర్ మార్కెట్ ద్వారా ఒక్క కంపెనీ ద్వారానే ఎంత సంపాదించారో తెలుసా... అక్షరాలా 9.43 కోట్లు. అంటే ఆ ఒక్క కంపెనీ నుంచే వారి ఆదాయం రోజుకు 13.66 లక్షలు. బిల్ కేర్ లిమిటెడ్ లో రాకేష్ కుటుంబసభ్యులు కొన్న 19.97లక్షల షేర్లే ఆయనకు కోట్ల రూపాయాలు సంపాదించిపెట్టాయి. రాకేష్ పేరుతో 17.35లక్షల షేర్లు ఉండగా..ఆయన భార్య పేరుతో బిల్ కేర్ కంపెనీకి చెందిన 2.62లక్షల షేర్లున్నాయి.
ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ రీసెర్చ్ సొల్యూషన్స్ సంస్థ ఇది. వాస్తవానికి ఇది మార్చి 23న మార్కెట్ సంక్షోభంలో అత్యంత దారుణంగా వాల్యూ పడిపోయింది. కంపెనీ లోయస్ట్ ప్రైస్ 14.25 వద్ద ట్రేడ్ అయింది. అప్పుడు 2కోట్ల 84లక్షలు మాత్రమే. సరిగ్గా జులై 3న అదే కంపెనీ అత్యధిక లాభాలను మూటగట్టుకుంది. ఫార్మా కావడంతో షేర్లు దూసుకపోయాయి. 52వారాల గరిష్ట స్థాయిని తాకింది. 61.45 వద్ద ట్రేడ్ అయింది. రాకేష్ ఝన్ ఝన్ వాలా సంపద ఏకంగా 12.27 కోట్లకు పెరిగింది. ఈ తర్వాత 69 ట్రేడింగ్ షెషన్లలో ఇది 331.22శాతం పెరిగింది. రాకేష్ ఈ మూడు నెలల్లో 31 కోట్లు సంపాదించారు.
సో...మార్కెట్ ట్రేడ్ చేయడంలోస్మార్ట్ గా ఆలోచించారు..లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ పెట్టుకుని.. వెంటనే నష్టాలు వచ్చాయని ఎగ్జిట్ అయితే లాభాలు ఎప్పటికీ రావు.. ముందుచూపుతో కంపెనీ ప్రొఫైల్ చూసి పెట్టుబడి పెడితే లాభాలు వాటంతట అవే వస్తాయి.. అలానే రాకేష్ ఝన్ ఝున్ వాలా రోజుకు 13లక్షలు సంపాదించారు. అందుకే ఆయన ఏస్ ఇన్వెస్టర్ అయ్యారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com