కరోనా బారిన పడిన బిజెపి ఎమ్మెల్యే

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే సిపి సింగ్ కరోనా భారిన పడ్డారు. మంగళవారం నిర్వహించిన పరీక్షలలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్నీ స్వయంగా ట్వీట్ చేసి సమాచారం ఇచ్చారు. అందులో తనకు కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తించారని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తనతో పరిచయం ఉన్న వారు,కోవిడ్ -19 పరీక్షను చేయించుకోవాలని సూచించారు. క్వారంటైన్ లో ఉన్నా లక్షణాలు లేనందువల్ల ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ప్రతిఒక్కరు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.

Tags

Next Story