కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం

కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
X

కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బుధవారం నుంచి లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు కర్ణాటక సీఎం ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడం ఎంతో ముఖ్యమని సీఎం బీఎస్ యెడియూరప్ప తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు తిరిగి పనులకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. కరోనా నివారణకు లాక్‌డౌన్ పరిష్కారం కాదని సీఎం యోడియూరప్ప అభిప్రాయపడ్డారు. కేవలం కంటైన్‌మెంట్ జోన్ల వద్దనే ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. కరోనా కట్టడికి ట్రేస్, ట్రాక్, టెస్ట్, ట్రీట్, టెక్నాలజీ అనే ఐదు టీల వ్యూహాన్ని తమ నిపుణులు సూచించినట్లు యెడియూరప్ప తెలిపారు.

Tags

Next Story