మంత్రులుగా ప్రమాణం చేయనున్న సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణగోపాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కొత్తగా ఇద్దరు మంత్రుల చేరనున్నారు. శ్రీకాకుళం నుంచి సిదిరి అప్పలరాజు, తూర్పుగోదావరి నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్న 1.29 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ వారితో ప్రమాణం చేయించనున్నారు.

శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్.. మండలి నుంచి మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు పంపించిన విషయం తెలిసిందే. అయితే, వారి మంత్రిత్వ శాకలు ఖాళీగా ఉండటంతో సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు కేబినేట్ లో అవకాశం దక్కించుకున్నారు.

Tags

Next Story