మూడు రాజధానుల నిర్ణయానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం : రతన్ శార్ధ

మూడు రాజధానుల నిర్ణయానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం : రతన్ శార్ధ
X

ఏపీలో మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శార్ధ ట్వీట్ చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం అన్యాయమని రతన్ శార్ధ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ బిల్లులను గవర్నర్ తిరస్కరించాలని చెప్పారు. ఈ సందర్బంగా మూడు రాజధానుల నిర్ణయానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని ఆయన అన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, రైతులు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించినా వైసీపీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లులు ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి.

Tags

Next Story