హైకోర్టులో సచిన్ పైలట్‌కు భారీ ఊరట

రాజస్తాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన ఎమ్మెల్యేకు హేకోర్టులో ఉపశమనం లభించింది. ఎమ్మెల్యేల అనర్హతపై జూలై 24 నాలుగు వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు స్పీకర్ కు సూచించింది. తిరుగుబాటు నేత పైలట్ తరపున న్యాయవాది ముకుల్ రోహద్గీ వాదిస్తూ... పైలట్‌తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ జోషి అత్యుత్సాహం ప్రదర్శించారని కోర్టులో వాదించారు. ఎలాంటి కారణాలు చూపించకుండా ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారుని అన్నారు. నోటీసులు జారీ చేసిన తరువాత మూడురోజులు మాత్రమే ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చారని అన్నారు. దీన్ని బట్టే స్పీకర్ వ్యవహారం అర్థం అవుతోందని రోహత్గీ అన్నారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశానికి హాజరుకాలేదని పైలట్ తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ జోషి వీరికి అనర్హత నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, వీటిని సవాల్ చేస్తూ తిరుగుబాటు దారు సచిన్ పైలట్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

