కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సచిన్ పైలట్ నోటిసులు

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సచిన్ పైలట్ నోటిసులు
X

రాజస్థాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని సచిన్ పైలట్ వాట్సప్ ద్వారా విలేకరలకు తెలియజేశారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరితే 35 కోట్లు ఇస్తామని సచిన్ పైలట్ తనకు ఆశచూపారని.. కానీ, తాను ఆ ఆఫర్ తిరస్కరించానని ఎమ్మెల్యే మలింగ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో సచిన్ పైలట్ ఆయన ఆరోపనలు ఖండిస్తూ.. ఆయనకు నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం కలిగించేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయని సచిన్ తన నోటీసుల్లో పేర్కోన్నారు.

Tags

Next Story