కొవిడ్ నుంచి కోలుకున్నా మళ్లీ.. !!

కొవిడ్ నుంచి కోలుకున్నా మళ్లీ.. !!

కొవిడ్ నుంచి కోలుకున్నా భవిష్యత్తులో అంటువ్యాధుల నుంచి శాశ్వత రక్షణ లభించకపోవచ్చని రోగనిరోధక శక్తి, టీకాల మన్నికను అర్థం చేసుకోవడానికి నిర్వహించిన ఓ అధ్యయనం సూచించింది. తేలికపాటి కొవిడ్ లక్షణాలు ఉన్న 34 మంది రోగుల రక్తం నుంచి ప్రతిరోధకాలు తీసుకొని వారికి హెచ్ఐవీ ఔషధాలు, రెమెడిసివిర్ ఇచ్చారు. లక్షణాలు ప్రారంభమైన 37 రోజుల తర్వాత తీసుకున్న ప్రతిరోధకాలను మొదట విశ్లేషించగా, తర్వాత 86 రోజుల తర్వాత మరొక విశ్లేషణ చేశారు. సుమారు 73 రోజుల అనంతరం యాంటీబాడీ స్థాయిలు త్వరగా పడిపోయాయని పరిశోధకులు కనుగొన్నారు. వీరి అధ్యయనంలో ముఖ్యంగా స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నవారికి శాశ్వత కొవిడ్ ప్రతిరోధకాలు ఉండకపోవచ్చని గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడినవారిలో చాలా వరకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వీరికి భవిష్యత్తులో కూడా తిరిగి ఈ వైరస్ సోకే అవకాశం ఉందని బ్లూమ్ బెర్గ్ అధ్యయనంలో తేలింది.

Tags

Read MoreRead Less
Next Story