దేశవ్యాప్తంగా ఐటి ఉద్యోగులకు శుభవార్త..

దేశవ్యాప్తంగా ఐటి ఉద్యోగులకు శుభవార్త..
X

దేశవ్యాప్తంగా ఉన్న ఐటి మరియు బీపీఓ ఉద్యోగులకు కేంద్ర టెలికమ్మ్యూనికేషన్ శాఖ ఊరట కలిగించే విషయం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ను డిసెంబర్ 31 వరకూ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐటి మరియు బీపీఓ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ విధానాన్ని డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తూ.. డిపార్ట్మెంట్ అఫ్ టెలీకమ్యూనికేషన్స్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. కోవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించడానికి ఏప్రిల్‌లో డబ్ల్యుఎఫ్‌హెచ్ నిబంధనలలో సడలింపును డిఓటి ప్రకటించింది, ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది.

Tags

Next Story