'ఏజెంట్ సాయి శ్రీనివాస్' కు బాలీవుడ్ లో భారీ డిమాండ్..

ఏజెంట్ సాయి శ్రీనివాస్ కు బాలీవుడ్ లో భారీ డిమాండ్..

భారీ బడ్జెట్ చిత్రాలను వెనక్కు నెట్టి ముందు వరుసలో నిలబడింది గత ఏడాది వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. కోటి రూపాయల బడ్జెట్ తీసిన ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే ఆరు కోట్లు వసూలు చేసింది. దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్ జే రూపొందించిన ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. థ్రిల్లర్, డిటెక్టివ్ తరహాలో రూపు దిద్దుకున్న ఈ సినిమా మూస చిత్రాలతో విసిగి పోయిన ప్రేక్షకుడికి ఓ కొత్త ఉత్సాహాన్ని అందించింది. ప్రేక్షకులు ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదరించడంతో ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనే ఆలోచనలో పడ్డాడు దర్శకుడు.

చిన్న సినిమా ఇంత సక్సెస్ ని చవిచూడడంతో ఈ సినిమాపై బాలీవుడ్ కన్ను పడింది. 2కోట్ల రూపాయలిచ్చి సినిమా రైట్స్ సొంతం చేసుకున్నారు. బడ్జెట్ కన్నా రెట్టింపు ఇచ్చి హక్కులు కొనుగోలు చేశారు. కాగా తమిళంలో కూడా ఈ చిత్రం రీమేక్ కానుందని ప్రముఖ కమెడియన్ సంతానం ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. అయితే హిందీలో ఎవరు నటిస్తారనే విషయం తెలియాల్సి ఉంది. మరో రెండు చిత్రాలు.. విశ్వక్సేన్ నటించిన హిట్.. సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహ నటించిన మత్తు వదలరా చిత్రాలు కూడా బాలీవుడ్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story