'ధ్రువాస్త్ర' ప్రయోగం సక్సెస్

దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ-ట్యాంక్ గైడెడ్ -శత్రువుల ట్యాంకులను పేల్చివేసే క్షిపణి
'ధ్రువాస్త్ర' ప్రయోగపరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించామని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ -డీఆర్‌డీవో తెలిపింది. డిఆర్‌డిఓ చే అభివృద్ధి చేయబడిన 'ధ్రువాస్త్ర' యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ప్రపంచంలో అత్యంత
అధునాతన ట్యాంక్ వ్యతిరేక ఆయుధాలలో ఒకటి. డిఆర్‌డిఓ నిర్వహించిన అభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగా ఈ అధునాతన క్షిపణిని జూలై 15 న రెండుసార్లు, అలాగే జూలై 16 న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుండి ఒకసారి పరీక్షించారు. ఇది మూడు అభివృద్ధి ప్రయత్నాలు విజయవంతంగా అయిందని, ప్రస్తుతం డేటాను విశ్లేషిస్తున్నామని డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com