చెన్నైలో ప్లాస్మా బ్యాంక్ ప్రారంభం.. 30 నిమిషాల్లో ఒకేసారి..

దేశ రాజధాని ఢిల్లీ తరువాత, దేశంలోని రెండవ ప్లాస్మా బ్యాంక్ చెన్నైలో ప్రారంభం అయింది. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (ఆర్‌జిజిజిహెచ్) లో ఈ బ్యాంకును ప్రారంభించారు, కరోనా రోగులకు చికిత్స చేయడానికి ప్లాస్మా థెరపీని ఉపయోగించడం మంచి ఫలితాలకు దారితీసిందని రాష్ట్ర ప్రధాన ఆరోగ్య కార్యదర్శి జె. రాధాకృష్ణన్ అన్నారు. ఈ దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం ఈ ప్లాస్మా బ్యాంకును సిద్ధం చేసింది. 2.34 కోట్ల రూపాయల వ్యయంతో

స్థాపించిన ప్లాస్మా బ్యాంకును ఆరోగ్య మంత్రి డాక్టర్ సి విజయబాస్కర్ ప్రారంభించారు. 30 నిమిషాల్లో ఒకేసారి ఏడుగురు వ్యక్తుల నుండి 500 మి.లీ ప్లాస్మా తీయడానికి ఇక్కడ ఉండే మౌలిక సదుపాయాలు ఉపయోగపడతాయి. కాగా చెన్నైలో ఎఐఎడిఎంకె శాసనసభ్యుడు ఎన్ సతన్ ప్రభాకర్ ఈ సదుపాయంలో మొదటి దాతగా నిలిచారు. ఇక దేశంలోని మొదటి ప్లాస్మా బ్యాంక్ ఢిల్లీలో రెండు వారాల క్రితం ప్రారంభమైంది.

Tags

Next Story