మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజే కరోనాతో 280 మంది మృతి

మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజే కరోనాతో 280 మంది మృతి
X

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. నిత్యం భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 10,576 మందికి క‌రోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,37,607కు చేరింది. అందులో 1,87,769 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 1,36,980 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక మ‌ర‌ణాలు సంఖ్య కూడా నిత్యం పెరుగుతోంది. బుధ‌వారం ఒక్క‌రోజే కొత్తగా 280 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 12,556కు చేరింది.

Tags

Next Story