పంట పొలాల్లో లక్షలు విలువ చేసే వజ్రాలు

పంట పొలాల్లో లక్షలు విలువ చేసే వజ్రాలు
X

రాయలసీమలో వర్షాలు కురిస్తే చాలు వజ్రాలు నేలను చీల్చుకొని బయటకు వస్తాయి. పట్టపగలే నక్షత్రాలను తలపించే విధంగా మెరుస్తాయి. కర్నూల్ జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని జొన్నగిరి, పగిడిరాయి, బొల్లవానిపాలెం గ్రామాల్లో వర్షాలు పడితే చాలు వజ్రాలు భూమిలోనుంచి బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తాయి. ఇక్కడ దొరికే వజ్రాలకోసం చుట్టుపక్కల గ్రామాలనుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా జనం తరలివస్తారు.

మద్దికెర మండలం మధనంతపుర గ్రామంలో ముగ్గురు వ్యక్తులు పొలంలో పనిచేస్తుండగా అయిదు లక్షల రూపాయలు విలువచేసే మూడు వజ్రాలు ఒకే రోజు దొరికాయి. అలాగే మరో రైతుకు లక్షరూపాయలు విలువచేసే వజ్రం దొరికింది. అదే క్రమంలో ఓ గొర్రెల కాపరికి యాభైవేలు విలువచేసే వజ్రం దొరికింది.

Tags

Next Story