'కరోనా' టీకా అందుబాటులోకి వచ్చేది అప్పుడే : డబ్ల్యూహెచ్‌ఓ

X
2021 కి ముందే టీకా వస్తుందనే ఆశ లేదని డబ్ల్యూహెచ్‌ఓ బుధవారం తెలిపింది. టీకా తయారీలో పరిశోధకులు విజయం సాధించినప్పటికీ, వచ్చే ఏడాది ప్రారంభ రోజులకు ముందే దీనిని ఆశించలేమని డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్ అన్నారు. వ్యాక్సిన్ నిర్మాణంలో స్వల్ప ఆలస్యం జరిగినా, భద్రతా ప్రమాణాలలో రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
టీకా తయారీలో మంచి పురోగతి సాధిస్తున్నాయన్న ర్యాన్.. అనేక సంస్థలు టీకాను తయారు చేస్తున్నాయని.. ఇవి ప్రస్తుతం 3వ దశలో ఉన్నాయని.. ఇప్పటివరకూ ఏదీ విఫలం కాలేదని, అభివృద్ధి చేసిన అన్ని టీకాలు భద్రత తోపాటు రోగనిరోధక శక్తిని పెంచే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
