అమెరికాలో భారీ భూకంపం

అమెరికాలో భారీ భూకంపం
X

అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో భారీ భూకంపం సంభవించింది. అలస్కాలోని దక్షిణ కోస్తా ప్రాంతంలో మంగళవారం రాత్రి 10.12 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.8గా నమోదైంది. పెరివిల్లేకు దక్షిణ-ఆగ్నేయదిశగా సముద్ర జలాల్లో 105 కిమీ, కొడియాక్‌కు ఈశాన్య దిశగా 320 కి.మీ దూరంలో, 28 కి.మీ లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. భూకంప కేంద్రానికి 160 కి.మీ నుంచి 805 కి.మీ దూరం వరకు ప్రకంపనలు సంభవించాయి. ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు.

Tags

Next Story